విష్ణు స్తుతి : జ్ఞాపకశక్తి

    మువ్వల . ధన్విన్ ( 5 సంవత్సరాలు) మువ్వల . మనోజ్  & మౌనిక గార్ల తనయుడు          ( U K G  ) విజ్ఞాన భారతి పబ్లిక్ స్కూల్,  చీరాలలో చదువుతున్నాడు.

     విష్ణు దేవుని స్తుతులతో అందరినీ  అలరిసున్నాడు. చిన్న వయసు నుండి భగవంతుని నామ సంకీర్తన చేయడం వలన మానసిక  వికాసం తో  పాటు జ్ఞాపక శక్తి పెంపొందుతుంది . 

    చిన్నవయసులోనే ధన్విన్  జ్ఞాపకశక్తి  కూడా  చక్కగా  పెంపొందేలా మన రాష్ట్ర , దేశ రాజధానులు చక్కగా చెప్పగలిగేలా అభ్యాసం చేయిస్తున్న  తల్లితండ్రులకు  అభినందనలు.  ఇలాగె  ప్రతిరోజూ ఒక్కసారి ఐనా పిల్లల చేత భగవంతుని నామాలను,  మంచి విషయాలను గుర్తుంచుకునేలా   స్మరణ చేయించటానికి ప్రయత్నించాలని కోరుకుంటున్నాము.

     ధన్విన్ తన జ్ఞాపక శక్తిని  మరింత పెంచుకొని చదువులో  చక్కగా  రాణించి మన  భారత దేశానికి  పేరు  ప్రఖ్యాతులు  తేవాలని కోరుకుందాము. ధన్విన్ భగవంతుని నామ సంకీర్తనలు , ఆటపాటలు , జ్ఞాపకశక్తి  వంటి ముచ్చటలు  మరింక చూసేద్దామా..