అనుకరించుట మరియు పట్టు విడవక సాధించుట.

ఏదైనా విషయాన్ని ముందుగామనం మన తల్లితండ్రులను చూసి అనుకరిస్తాముఅందుకే తల్లితండ్రులు  పనులలో ఎలా వ్యవహరిస్తారో  పిల్లలు కూడా అదే విధంగా ప్రవర్తిస్తారు.  పిల్లలు ఎంత శ్రద్ధగా తమ చుట్టూ జరుగుతున్న విషయాలను పరిశీలిస్తారోవాటినే తిరిగి వారు ప్రదర్శిస్తారుఅలా వారు ప్రదర్శిస్తున్నారు అంటే వాళ్ళు  మంచి తెలివితేటలతో  ఎదుగుతున్నట్లే.

అందుకే ప్రతిరోజు తల్లితండ్రులు ఇంట్లో పనులు చేస్తున్నపుడుపిల్లలకు కూడా చిన్న చిన్న పనులు చెపుతూ వారితో చేయిస్తుంటే వారు కూడా  పనులు  చేయడంలో చక్కటి నైపుణ్యం పొందుతారుపిల్లలు  ఇంట్లోబయటా తమ చుట్టూ జరుగుతున్న విషయాలను పరిశీలించి వాటిని తరువాత అనుకరించి చూపిస్తూ తమకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకుంటారుఎదిగే పిల్లలో ఇది ఒక మంచి అభ్యాసం.

పిల్లలు పక్షుల కూతలను, జంతువుల అరుపులను అనుకరిస్తూ ఉంటారు. అందులో విభిన్నమైన ధ్వనులను గుర్తించడం వారు నేర్చుకునే ఒక మంచి అంశం. అలాగే ఇతర అంశాలైన చదువు, మంచి మంచి కళలు ఇతరుల నుంచి కొంత అనుకరించి, నేర్చుకొని  తర్వాత తమ స్వంత ప్రతిభాపాటవాలతో వాటిలో ప్రావీణ్యత పొంది ఉన్నత శిఖరాలకు చేరుకొంటారు.

           అలాగే ఒక పనిని మొదలు పెడితే అది పూర్తి అయ్యేవరకు విడువకుండా చేయగలగడం కూడా ఒక చక్కటి నైపుణ్యం.  పిల్లలకు ఏదైన ఒక పని చేయమని చెపితే  పనిపట్ల ఎంతో శ్రద్ధఆసక్తితో పనిని వారు మద్యలో వదలకుండా పూర్తి చేయగలిగితే ,  అనితర సాధ్యమైన పనులను కూడా ఓర్పుతో నేర్పుతో సాధించగలుగుతారు.   

                ఇలాంటి చక్కటి తెలివితేటలునైపుణ్యాలతో మన ముందుకు వస్తుంది  చాగంటి హరిచరణ్ & బ్రహ్మణిల సుపుత్రిక రెండు సంవత్సరాల చిన్నారి చాగంటిమనస్వి.