కాకి వినూత్న ఆలోచన
అనగా అనగా ఓ కాకి. ఆ
కాకికి దాహం వేసింది. నీళ్ల కోసం చుట్టుతా
చాలా దూరం వరకు చూసింది. ఓచోట
ఓ కుండ కనిపించింది. అందులో నీరు చాలా
క్రిందికి ఉన్నాయి. కాకి
తలను ఎంత క్రిందికి దించినా,
ఆ నీరు దానికి అందలేదు. కుండను
క్రింది వైపు ముక్కుతో పొడిచింది.
ఆ కుండకు చిల్లు పడలేదు. దానిలో
నీరు ఎలా త్రాగాలో కాకికి
అర్ధం కాలేదు. ఏం
చెయ్యాలి ? చెప్మా అనుకుంటూ చూట్టూ చూసింది. ప్రక్కనే
ఓ గులక రాళ్ళ గుట్ట
కనపడింది. ఆ గుట్ట మీద
ఎండు గడ్డిపోచలు కనిపించాయి. అప్పుడు కాకికి, తన “జేజమ్మ” కాకి చెప్పిన
కథ గుర్తుకువచ్చింది. ఆ కథలో , తనలాంటి
కాకి దాహం తీర్చుకోడానికి ఒక్కొక్క
గులకరాయి తీసుకువెళ్ళి కుండలో వేస్తే, కుండలో అడుగున ఉన్న నీరు కుండ
పైకి రాగా, కాకి దాహం
తీర్చుకున్న కథ గుర్తుకు వచ్చింది.
పర్యావరణ పరిరక్షణ లో “ ఎకో ఫ్రెండ్లీ స్ట్రా" కథ
గడ్డి పరకను " స్ట్రా "గా ఉపయోగించిన కాకి కథ తెలుసుకున్న సందర్భంలో , ఇప్పుడు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ “స్ట్రా “లకు బదులుగా క్రొత్తగా గోధుమగడ్డితో, వెదురుతో, బొప్పాయి కాడల నుండి ఇంకా ఇతర వ్యవసాయ ఉత్పత్తుల నుండి " ఎకో ఫ్రెండ్లీ" " స్ట్రా"లు మనకు అందుబాటులో ఉన్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను.
ఎకో ఫ్రెండ్లీ స్ట్రాలను తయారుచేయడానికి ముందుగా పండించిన గడ్డిని తీసుకొని, నీటితో శుభ్రపరచి, 20సెంటీ మీటర్ ( 8 అంగుళాలు)
ముక్కలుగా కత్తిరించుకోవాలి. లోపలి భాగాన్ని ఇనుప చువ్వతో శుభ్రపరచాలి. మరలా వాటిని నీటితో శుభ్రపరచి
అరటి ఆకులలో కట్టలుగా చుట్టి పెట్టాలి. ఆకుపచ్చ స్ట్రా లను జిప్ బాగ్‌లో పెట్టి ఫ్రిడ్జ్
లో నిల్వ ఉంచుకోవచ్చు. అవి 2 వారాల వరకు పాడవకుండా ఉంటాయి.
ఎండిన
స్ట్రా తయారుచేయాలంటే, ఆకుపచ్చ స్ట్రా లను రెండు లేక మూడు రోజులు ఎండలో
ఆరబెట్టాలి. తరువాత ఓవెన్ లో పెట్టి వేడి చేసి వాడుకోవచ్చు. అలా చేసిన వాటిని 6 నెలల వరకు వాడుకోవచ్చు.
"ఎకో ఫ్రెండ్లీ స్ట్రా" తయారుచేయు విధానం
పేపర్ తో "స్ట్రా" తయారుచేయువిధానం
మనకు కావలసిన రంగు పేపర్లను లేదా న్యూస్ పేపర్ ను తీసుకొని
2.5 అంగుళాలు వెడల్పు, 15 అంగుళాలు పొడవు ఉండే విధంగా
కత్తిరించి పెట్టుకోవాలి. చ్యాప్
స్టిక్ తీసుకొని, కత్తిరించిన
పేపరు చివరి భాగాన్ని ఈ విధంగా స్టిక్
కు చుట్టడం మొదలుపెట్టి పేపర్ను చివరి
వరకు చుట్టాలి. ఈ
విధంగా పేపర్ ను చివరి
వరకు చుట్టిన తర్వాత, చివరి కొసకు కొద్దిగా
గ్లూ అంటించి చుట్టేయాలి. స్టిక్ ను బయటకు తీసి, పేపర్
స్ట్రా ను రెండు చివరలా కొద్దిగా కత్తిరించాలి. మీ పేపర్ "స్ట్రా"
తయారయిపోయింది. న్యూస్ పేపర్ ను ఈ విధంగా మడిచి కత్తిరిస్తే మనకు కావలసిన సైజులో 8 ముక్కలు
తయారవుతాయి. వాటిని మనం ఈ విధంగా స్ట్రాలుగా తయారుచేయవచ్చు.
ఇంక "ప్లాస్టిక్ స్ట్రా" లకు వీడ్కోలు పలికి, మనం "ఎకో ఫ్రెండ్లీ స్ట్రా"లకు స్వాగతం పలుకుదాం.
చూశారా పిల్లలూ! క్రొత్త క్రొత్త ఆలోచనలతో కావలసిన పనులను, తేలికగా, తక్కువ సమయంలో, చక్కపెట్టుకోడానికి, మన పర్యావరణాన్ని కాపాడే వస్తువులను తయారుచెయ్యడానికి మీరు కూడా ప్రయత్నం చేస్తారు కదూ.
0 కామెంట్లు